బిగ్ బాస్ లో రీ-ఎంట్రీ ఇవ్వనున్న నూతన్ నాయుడు?

By iQlikMovies - July 14, 2018 - 16:11 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగులో సామాన్యుడిగా ప్రవేశించిన నూతన్ నాయుడు ప్రయాణం బిగ్ బాస్ హౌస్ లో కేవలం రెండు వారాలే కొనసాగినప్పటికి ఆయనకి మాత్రం ఒక ఆసక్తికర పార్టిసిపెంట్ గా అయితే ఆయనకీ వీక్షకుల్లో ఒక గుర్తింపు దక్కింది.

హౌస్ నుండి బయటకి వచ్చాక పలు టీవీ ఛానెల్స్ లో ఆయన ఇంటర్వ్యూ లకి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ తరుణంలో ఆయనకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని హౌస్ లోకి ఆయనని వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా పంపించే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు అని ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్త.

ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ రేపటికి 5 వారాలు పూర్తి చేసుకుని 6వ వారంలోకి అడుగుపెట్టనున్న ఈ తరుణంలో ఒక పార్టిసిపెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వస్తారు అన్న అంచనాల నడుమ ఈ కొత్త చర్చకి బలం వచ్చినట్టయింది. 

ఏదేమైనా ఈ వీకెండ్ ఎపిసోడ్లు బట్టి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రి పైన క్లారిటీ వస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS