అక్కినేని కోడలు సమంత నటించిన తాజా చిత్రం 'ఓ బేబీ' బాక్స్ ఆఫీస్ దెగ్గర దుమ్ము దులుపుతోంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో ఓ బేబీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఆలా మొదలయింది తో హిట్ కొట్టిన నందిని రెడ్డి దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న ఈ చిత్రం జోరుని చూసి ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ బాబు నిర్మాణంలో 'ఓ బేబీ' హిందీ రీమేక్ లో ఆలియా భట్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిబొట్ల తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మరో సంచలనమైన వార్త లీక్ చేశారు. బాలీవుడ్ (దంగల్, సీక్రెట్ సూపర్స్టార్, మామ్) నుంచి చైనా కి డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ లు గా నిలిచిన చిత్రాల వరుసలో ఇప్పుడు మన బేబీ ని కూడా నిల్చోబెడుతున్నట్టు తెలిపారు. అయితే దీని ఒరిజినల్ 'మిస్ గ్రాన్నీ' ఇంతకుముందే చైనా లో విడుదలైంది. ఇప్పుడు మన బేబీ ని చైనా ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో చూడాలి.