శ‌ర్వా సినిమా కోసం 'భూకంపం'

By iQlikMovies - December 19, 2018 - 10:46 AM IST

మరిన్ని వార్తలు

ప‌డి ప‌డి లేచే మ‌న‌సు... ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రో రెండు రోజుల్లో బొమ్మ ప‌డిపోతోంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. 'తేజ్ ఐ ల‌వ్ యూ' సినిమాకీ ఈ లైన్‌కీ చాలా ద‌గ్గ‌ర పోలిక‌లుంటాయ‌ని స‌మాచారం. ఇదో ప్రేమ‌క‌థే అయినా.... ఈ క‌థ‌లో హ‌ను రాఘ‌వ‌పూడి కొన్ని ట్విస్టులు పేర్చుకుంటూ వెళ్లాడ‌ని, ఆ ట్విస్టులే ఈ క‌థ‌కి ఓ కొత్త రూపుతీసుకొస్తాయ‌ని తెలుస్తోంది. 

 

అన్న‌ట్టు ఈ సినిమాలో ఓ భూకంపం సీక్వెన్స్ ఉంద‌ట‌. క‌థ మ‌లుపు తిర‌గ‌డానికి ఆ భూకంప‌మే ఓ కార‌ణ‌మ‌ని స‌మాచారం. ఈ సీక్వెన్స్‌ని విజువ‌ల్ ఎఫెక్ట్స్‌లో సృష్టించ‌డానికి చిత్ర‌బృందం బాగానే క‌ష్ట‌ప‌డింద‌ట‌. శర్వానంద్ - సాయిప‌ల్ల‌వి జంట‌గాన‌టించిన చిత్ర‌మిది. ఇప్ప‌టికే పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. 21న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాతో పాటు 'అంత‌రిక్షం', 'కే జీ ఎఫ్‌' చిత్రాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ సినిమా నిల‌బ‌డుతుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS