పడి పడి లేచే మనసు విడుదలకి ముహూర్తం ఖరారు

మరిన్ని వార్తలు

శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం 'పడి పడి లేచే మనసు'.. 

ఇటీవలే టీజర్ విడుదల అవగా 3.5 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. కాగా సినిమాకు సంబంధించిన మొదటి పాట వివరాలను చిత్ర  నిర్మాతలు ప్రకటించారు.. నవంబర్ 12న సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. 

మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది.. 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తుండగా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS