ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ లో పద్మావతి చిత్రం గురించిన వివాదం కూడా ఒకటి. ఈ చిత్రం పై తమకి చాలా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు ఉన్నాయి అని కర్ణి సేన ప్రకటిస్తున్న నేపధ్యంలో అలాగే తమ అనుమతి లేకుండా చిత్రాన్ని విడుదల చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు.
ఇప్పటికే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలకి రూ 5 కోట్ల వెల కట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ బోర్డు వద్ద సెన్సార్ కి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూడలేదు అని తెలిసింది, యూనిట్ సభ్యులేమో త్వరగా ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేస్తే తాము ఈ చిత్రాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారికి చూపిస్తాము అని కోరుతున్నారు.
మరి వీరి కోరికని మన్నించి సెన్సార్ బోర్డు త్వరగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తుందా అనేది తెలియాల్సిఉంది. ఇక పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ చిత్రం విడుదల వాయిదా కూడా పడొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.