సునీల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌

మరిన్ని వార్తలు

సునీల్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్‌ 'టూ కంట్రీస్‌'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'టూ కంట్రీస్‌' మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి, సెంటిమెంట్‌ పరంగా అదే టైటిల్‌ను తెలుగులోనూ కంటిస్యూ చేస్తూ రీమేక్‌ చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌ చూస్తున్నాడు సునీల్‌. అయితే ఈసారి ఈ సినిమాతో హిట్‌ పక్కా అని నమ్మకంగా చెబుతున్నారు.

 

తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాలో చాలానే మార్పులు చేశారట. కానీ మూలం మాత్రం అదేనట. అయితే సునీల్‌ అంటేనే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో పంచ్‌ డైలాగులు సూపర్బ్‌గా పేలనున్నాయట. డైలాగ్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారట ఈ సినిమాలో. అన్నీ పంచ్‌ డైలాగులేనట. కడుపుబ్బా నవ్విచడమే లక్ష్యంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ధియేటర్‌కి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడికీ టికెట్‌ పైసా వసూల్‌ అనే రేంజ్‌లో ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిళితం చేయనున్నారట. 'మర్యాద రామన్న', 'పూల రంగడు' తదితర చిత్రాలతో సునీల్‌ కామెడీ హీరోగా మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సునీల్‌ ఖాతాలో పడలేదు. కానీ ఈ సినిమాతో మళ్లీ సునీల్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవనున్నాడనీ చిత్ర యూనిట్‌ సమాచారమ్‌. మనీషా రాజ్‌ ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా నటిస్తోంది. 

కమెడియన్‌గా సునీల్‌ ఎనర్జీ ఏంటో మనకు తెలుసు. అలాగే, కామెడీ హీరోగా సునీల్‌ పర్‌ఫామెన్స్‌ కూడా తెలుసు. కానీ ఈ సినిమాలో కొత్త సునీల్‌ని కొత్త ఎనర్జీని చూడబోతున్నామట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది 'టూ కంట్రీస్‌'. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గెట్‌ రెడీ ఫర్‌ న్యూ ఫీల్‌ లాఫింగ్‌. ఎన్‌. శంకర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్నున్న చిత్రమిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS