బిగ్‌బాస్ సీజన్ 3లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతవరకూ గ్రూపు రాజకీయాలుగా సాగిన బిగ్‌బాస్‌లో జంట రాజకీయాలు హౌస్నేలుతున్నాయి. ఇద్దరిద్దరు జోడీ లెక్కల్లో హౌస్ రన్ అవుతోంది. అందరికీ తెలిసిన జంటగా, బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిన జంట వరుణ్ - వితికలే కాకుండా, హౌస్‌లో ఇంకొన్ని జంటలు ఫామ్ అయ్యాయి. 'జంట'లో రిలేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఫామ్ అవుతున్నాయనుకోండి. అన్నా - చెల్లి, అక్కా - తమ్ముడు, ఫ్రెండ్స్.. ఇలా జంట జంటగా మసలుతున్నారు. ఈ జంటలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. మొదట్లో శ్రీముఖి, రాహుల్ ఫ్రెండ్స్‌గా ఒక మాట మీదుండేవారు.
వారి మధ్య చిన్న క్లాష్ రావడంతో, రాహుల్, పునర్నవికి కనెక్ట్ అయ్యాడు. శివజ్యోతి - అలీ జంట అన్నా చెల్లెళ్లుగా కొనసాగుతున్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే, బాబా భాస్కర్ - శ్రీముఖిని ఓ జంటగా చెప్పుకోవచ్చు. పరస్పర సహకారం చేసుకుంటున్నారు. అలాగే బాబా భాస్కర్, మహేష్ కూడా జంటగా పరిగణించాలి. జంటగా మసలుతున్న వాళ్లిద్దరూ, ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా జంటలుగా సాగుతున్న బిగ్‌బాస్ సీజన్ 3లో చివరికొచ్చేసరికి మూడు జంటలు పోటీ పడనున్నాయట. ఆ మూడు జంటలేంటనేది ముందు ముందు తెలియనుంది.