ఆమె పెళ్ళికి రెడీ.. పెళ్ళికొడుకు కావలెను.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా తాను పెళ్ళికి రెడీ అంటోంది. అయితే, పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో వెతికి చెప్పాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ ‘రిక్వెస్ట్‌’ చేసింది. సీరియస్‌గా కాదండోయ్‌.! సరదాకి మాత్రమేనట.! పెళ్ళీడు ఎప్పుడో వచ్చేసినా, పెళ్ళి గురించిన ఆలోచనలు ప్రస్తుతానికి లేవట ఈ భామకి. మరి, సోషల్‌ మీడియా వేదికగా పెళ్ళి కొడుకు కావాలంటూ ఎందుకు అభ్యర్థించినట్లు.? అంటే, దానికీ ఓ పెద్ద కథే వుంది. ఈ బ్యూటీ ఇటీవలే బ్రైడల్‌ గెటప్‌లో ఫొటో సెషన్‌ చేయించుకుంది. అదీ అసలు సంగతి.

 

ఏ మ్యాగజైన్‌ కోసం హాట్‌ ఫొటో సెషన్‌ని ట్రెడిషనల్‌ బ్రైడల్‌ గెటప్‌లో చేయించుకున్న పరిణీతి చోప్రా, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ‘నేను పెళ్ళికి రెడీ.. పెళ్ళి కొడుకు కావలెను’ అని పేర్కొంది. ఇంకేముంది.? ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పెట్టేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ‘ఆగండాగండీ, ఇదంతా జస్ట్‌ ఫర్‌ ఫన్‌..’ అని చివరికి తేల్చేసింది ఈ బ్యూటీ. ‘నేనూ పెళ్ళి చేసుకోవాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. అయితే, దానికి కాస్త సమయం వుంది..’ అంటోన్న పరిణీతి చోప్రా, ప్రస్తుతానికైతే ఎవరితోనూ ప్రేమలో పడలేదట. కో-స్టార్స్‌తో ఫ్రెండ్లీగా వుండడం ‘లవ్‌’ కాదనీ, ‘లవ్‌’కి అంటూ కొన్ని లెక్కలుంటాయని ఈ బొద్దుగుమ్మ చెబుతోంది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమా.? పెద్దలు కుదిర్చిన పెళ్ళా.? అన్నదానిపై ఇంకా ఓ క్లారిటీకి రాలేదట ఈ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS