రేణు వచ్చింది పవన్‌ ప్యాన్స్‌ రెచ్చిపోయారు.!

మరిన్ని వార్తలు

చాన్నాళ్ల తర్వాత రేణుదేశాయ్‌ మీడియా ముందుకొచ్చింది. రేణూదేశాయ్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ మాజీ సతీమణి. రెండు తెలుగు సినిమాల్లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు వివిధ విభాగాల్లో పని చేసింది కూడా. పవన్‌ కళ్యాణ్‌తో సహజీవనం, పెళ్లి, ఆ తర్వాత విడాకులు.. ఇదంతా ముగిసిన చరిత్ర. ఆమె మరో తోడు వెతుక్కుందిప్పుడు. 2019లో రేణూ దేశాయ్‌ పెళ్లి చేసుకోబోతోంది. 

 

మొన్నీ మధ్య ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అతనెవరన్నది తెలియలేదు. ఆ సంగతి పక్కన పెడితే, తాను రాసిన కవితల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చింది రేణూదేశాయ్‌. ఆ పుస్తకం ప్రమోషన్‌ కోసం వచ్చిన రేణూ దేశాయ్‌ పలు అంశాలపై మాట్లాడింది. అయితే ఎక్కడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో ఏం జరిగిందో, దానికి తాను చింతిస్తున్నాననీ, ఆయనపై కోపం లేదనీ చెప్పింది. 

 

అయితే అభిమానుల పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో రేణూదేశాయ్‌పై వివాదాస్పద కామెంట్స్‌ చేస్తున్నారు. రేణూ - పవన్‌ పరస్పరం గౌరవించుకుంటున్నా, కొందరు దురభిమానులు మాత్రం ప్రతీ విషయాన్ని వివాదాస్పదంగా మార్చుతున్నారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. తప్పదు రేణూ దేశాయ్‌ ఆ కామెంట్స్‌పై కౌంటర్‌ ఇవ్వాల్సిందే. కౌంటర్‌ ఇస్తే మళ్లీ వివాదం తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS