గబ్బర్ సింగ్ తో రీమేక్ సినిమాల్ని ఇలాక్కూడా తీయొచ్చు... అని నిరూపించుకున్నాడు హరీష్ శంకర్. గద్దల కొండ గణేష్ కూడా రీమేకే. అయినా... అందులో తన స్టైల్ కనిపిస్తుంది. అందుకే... ఇప్పుడు మరో రీమేక్ హరీష్‌ని వెదుక్కుంటూ వెళ్లిందని టాక్.
మలయాళంలో ఘన విజయం సాధించి, విమర్శకుల మెప్పు పొందింది అయ్యప్పనుమ్ కోషియమ్. ఈ చిత్రాన్ని తెలుగులో రవితేజ - రానాలతో రీమేక్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. దర్శకుడిగా హరీష్ శంకర్ పేరు దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. అయితే హరీష్ చేతిలో పవన్ కల్యాణ్ సినిమా ఒకటుంది. 2021 ప్రారంభంలో ఈసినిమా పట్టాలెక్కాలి. ఈలోగా రీమేక్‌ని పూర్తి చేయగలుగుతా అన్న నమ్మకం ఉంటే ఓకే. లేదంటే... హరీష్ ఈ సినిమాని టేకప్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు హరీష్‌కి పవన్‌తో సినిమా చేయడం చాలా ముఖ్యం. పవన్ తో సినిమా నాటికి.. ఈ రీమేక్ పూర్తవుతుందనుకుంటే హరీష్ లైన్లోకి వస్తాడు. దానికి పవన్ అంగీకారం కూడా అవసరం. ఎందుకంటే.. `వకీల్ సాబ్` అవ్వగానే హరీష్ శంకర్ సినిమానే పట్టాలెక్కించాలని పవన్ భావిస్తున్నాడు. హరీష్ కాదంటే, మరో ఆప్షన్ కూడా నిర్మాతల దగ్గర ఉంది. సుధీర్ వర్మతో ఈ రీమేక్ పట్టాలెక్కిస్తారు.