ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని, దాన్ని ఎవరూకదిలించలేరని స్టేట్‌మెంట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి కోసం పోరాటం చేస్తున్న నేతల్లో పవన్ ఒకరు. రైతుల పక్షాన నిలిచి, పోరాటానికి పవన్ సిద్ధమయ్యాడు. అందుకోసం బిజేపీతోనూ పొత్తు కుదుర్చుకున్నాడు. అయితే.. పవన్‌పై ఓ షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమరావతిలో పవన్‌కీ భూములున్నాయని, దాదాపు 60 ఎకరాల్ని పవన్ కొనుగోలు చేశాడని, అందుకోసమే.. ఇలా పోరాటం చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ పేరుమీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు కొన్ని పత్రాల్ని కూడా సోషల్ మీడియాలో వదిలారు.
దీనికి నీ సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ ?
— Vizag - The City Of Destiny (@Justice_4Vizag) January 23, 2020
అమరావతి ప్రాంతంలో Lingamaneni Estates private Limited 5 కోట్లు విలువ చేసే భూమిని నీకు 20లక్షలకే ఎలా వచ్చింది ?
చంద్రబాబు బినామీ లింగమనేని నీకు 20లక్షలకే ఎందుకు ఇచ్చాడు ?#AmaravatiScam #PawanKalyan pic.twitter.com/9d9pckM9yr
అయితే అది నిజమేనా, నకిలీవా? అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. కేవలం పవన్ ని ఇరుకున పెట్టడానికే కొంతమంది ఇలా నకిలీ పత్రాలు సృష్టించి, సోషల్ మీడియాలో పెట్టారని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్‌కి భూముల మీద, ఆస్తుల మీద ఆశల్లేవని, అమరావతిపై జరుపుతున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికే ఇలాంటి కట్టుకధలు చెబుతున్నారని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.