సాహోకి కలిసొచ్చిన వినాయక చవితి దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో. ఇలాంటి సినిమాలు పక్కాగా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుని రావాలి. లాంగ్ వీకెండ్ ఉంటే.. చాలా ఉపయోగం కూడా. సాహో అలాంటి ప్లానింగ్‌తోనే వచ్చింది. శుక్ర, శని, ఆది.. ఎలాగూ కలిసొస్తుంది. సోమవారం (వినాయక చవితి) సెలవు రావడం బోనస్‌గా మారింది. తొలి మూడు రోజుల దూకుడు నాలుగో రోజూ చూపించింది సాహో. దాంతో సాహో రికార్డు ప్రభంజనం నాలుగో రోజూ కనిపించింది.
నైజాంలో ఇప్పటి వరకూ 23.30 కోట్లు వసూలు చేసింది సాహో. సీడెడ్‌లో 9.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు రాబట్టింది. తూర్పు, పశ్చిమ, కృష్ణా, నెల్లూరు కలిసి 20 కోట్లు దాటేసింది. నాలుగు రోజుల గ్రాస్ మొత్తం కలుపుకుంటే దాదాపుగా 350 కోట్లు లెక్కతేలుతోంది. అయితే ఈ అంకెలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. మంగళవారం ఈ సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యే ఛాన్సులున్నాయి. అయితే వచ్చే వారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం సాహోకి కలిసొస్తుంది. ఈ వీకెండ్‌ని కూడా సాహో క్యాష్ చేసుకుంటే.. ఆర్థికంగానూ సాహో గట్టెక్కేసినట్టే.