పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ ఎప్పుడో విడిపోయారు. రేణూతో విడిపోయి పవన్ మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే.. ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం వసివాడలేదు. అప్పుడప్పుడూ పవన్ పూణె వెళ్లడం, తన పిల్లల్ని చూసుకుని రావడం మామూలే. రేణూ కూడా పవన్‌కి వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఇప్పుడు వీరిద్దరి మధ్య అనుబంధానికి మరో సాక్ష్యం దొరికింది.
రేణూ దేశాయ్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ఓ ఫ్లాట్కొనుగోలు చేసిందట. అయితే ఆ ఫ్లాట్ కి డబ్బులు ఇచ్చింది మాత్రం పవన్‌కల్యాణ్ అని సమాచారం. తన పిల్లల కోసం, మాజీ భార్య కోసం పవన్ ఇచ్చిన ఖరీదైన కానుక ఇదే అని తెలుస్తోంది. రేణు ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టింది. కొన్ని సినిమాల్లో నటిస్తోంది. దర్శకత్వం, నిర్మాణ రంగం వైపు కూడా తను దృష్టి సారిస్తోంది.