యంగ్ హీరో నితిన్ నుండి ఏ సినిమా వచ్చినా, ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్‌పై తనకున్న వీరాభిమానాన్ని చాటుకుంటాడు నితిన్. అలాంటిది నితిన్ తాజా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'లో పవన్ ఎఫెక్ట్ ఏమీ లేదు. పోస్టర్స్ మీదనో, ఏదో ఒక స్టిల్‌లోనో, స్టైల్‌లోనో పవన్‌ని దించేసేవాడు. అలాంటి రిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. అందులోనూ ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి, పోస్టర్స్ మాత్రమే రిలీజయ్యాయి. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ పోస్టర్స్ అన్నింట్లోనూ పెళ్లికి సంబంధించిన స్టిల్స్‌నే రిలీజ్ చేశారు. రేపు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది.
ఇప్పటిదాకా ఆడియో ఫంక్షన్‌కి సంబంధించి కూడా స్పెషల్ సమాచారాలు ఏమీ లేవు. తన దేవుడు పవన్‌ని ఈ సినిమా ఫంక్షన్‌కి ఆహ్వానించాడో లేదో నితిన్ పక్కా సమాచారమైతే లేదు. మామూలుగా అయితే నితిన్ నటించిన కొన్ని సినిమాల ఆడియో ఫంక్షన్స్‌కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చి తన భక్తుడి సినిమాని ఆశీర్వదిస్తాడు. అలా గతంలో పలు చిత్రాల ఆడియో ఫంక్షన్స్‌కు పవన్ హాజరైన సంగతి తెలిసిందే.
ఇకపోతే నితిన్ విషయానికి వస్తే, 'అ,ఆ..' తర్వాత ఆ స్థాయి హిట్‌ని అందుకోలేకపోయాడు నితిన్. 'లై', 'ఛల్ మోహన్‌రంగా' సినిమాలతో విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేశాడు. కానీ విడుదలయ్యాక రెండు సినిమాలు తుస్సుమనిపించాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంతగా అంచనాలేమీ లేవు.
కానీ ఈ సారైనా నితిన్ ఏం చేస్తాడో చూడాలి మరి.