మెగా-పవర్‌ : ఈ కలయిక నిజమేనా?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాలతో ఇరువురి కలయిక సాధ్యం కావడంలేదు. చిరంజీవి తొమ్మిదేళ్ళ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటిస్తే, ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా పవన్‌ హాజరు కాలేకపోయాడు. అయితే ఈసారి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ కలయిక ఖాయమని మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారమ్‌ అందుతోంది. వచ్చే నెలలో చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. రామ్‌చరణ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'మహావీర' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ప్రప్రధమ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథే ఈ సినిమా. కేవలం తెలుగు సినిమాలాగానే కాకుండా, 'బాహుబలి' తరహాలో ఇండియన్‌ సినిమా అనిపించుకునేలా అత్యంత భారీతనంతో యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండేలా 'మహావీర' చిత్రాన్ని రూపొందించనున్నారట. దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవన్‌కళ్యాణ్‌ రావడం ఖాయమట. పవన్‌కళ్యాణ్‌ మాత్రమే కాకుండా మొత్తం మెగా కాంపౌండ్‌ ఈ ఈవెంట్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ కానుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ వేడుకకి హాజరయ్యే అవకాశాలున్నాయట. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS