పవన్ కళ్యాణ్ సినిమాలో కొత్త భామలు అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు భామలు ఈ సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టేశారట. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కాస్త బొద్దుగా ఉంటుంది కదా, దర్శకుడు త్రివిక్రమ్ సూచనతో కాస్త స్లిమ్ అయ్యిందట. ఇలా స్లిమ్ అవ్వడానికి కొంచెం గట్టిగానే కష్టపడుతోందట ఈ భామ. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేనాటికి ఇంకాస్త సన్నబడనుందట. అలాగే అను ఇమ్మాన్యుయేల్ తెలుగు నేర్చుకుంటోందట. కీర్తి సురేష్ కొంతవరకు తెలుగులో పర్వాలేదు. మాట్లాడలేకపోయినా బాగానే అర్థం చేసుకుంటుంది. దాంతో ఈ ముద్దుగుమ్మ కూడా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందట. ఎంతైనా త్రివిక్రమ్ సినిమా కదా, డైలాగుల్లో వేగం ఉంటుంది. భాష అర్ధమైతేనే సీన్‌లో నటించేటప్పుడు నేచురాలిటీ ఉంటుంది. లాంగ్వేజ్ బాగా అర్థమయితే తమ అద్భుతమైన నటనకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఈ ఇద్దరు భామలు లాంగ్వేజ్‌పై పట్టు సాధించడానికి తగిన శిక్షణలు తీసుకుంటున్నారట. అంతేకాదు పవన్ సినిమాల్లో హీరోయిన్లు అంటే చాలా అందంగా కనిపిస్తారు స్క్రీన్‌పై. ఆల్రెడీ ఈ భామలిద్దరూ అందంలో పోటా పోటీనే. ఇక టాలెంట్ పరంగా ఈ ఇద్దరూ ఎంతెంత మార్కులేయించుకుంటారో చూడాలి. మార్చ్ 14న ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.