చెప్పను బ్రదర్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి యాంటీ అయిపోయాడు అల్లు అర్జున్. ఆ తరవాత ఆ డౌలాగ్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా... పవన్ ఫ్యాన్స్ లో వేడి చల్లారలేదు. ఆ ఎఫెక్ట్ డీజే టీజర్‌పై తగిలింది. ఏ టీజర్‌కీ రానన్ని డిజ్ లైక్స్ ఈ టీజర్‌కి రావడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై బన్నీ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నాడట. అసలు టీజర్ విషయంలో నెగిటీవ్ టాక్ స్పైడ్ చేసిందెవరు?? పవన్ ఫ్యాన్సే చేశారా, లేదంటే యాంటీ మెగా ఫ్యాన్స్ హస్తం ఉందా?? అనే విషయంలో బన్నీ ఆరా తీస్తున్నాడని అర్థమైంది. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇవ్వడానికి కూడా అల్లు అర్జున్ రంగం సిద్ధం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మిస్టర్ లేదంటే ఫిదా ఆడియో ఫంక్షన్లలో బన్నీ నోరు విప్పే అవకాశం ఉందని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ ఫ్యాన్స్‌పై సెటైర్లు వేయడానికి ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో వపన్ ఫ్యాన్స్‌ని మరీ కెలికితే... వ్యవహారం వేరుగా ఉంటుందని, టీజర్‌కే పరిమితమైన డామేజీ.. డీజే వసూళ్లపైనా పడే అవకాశం ఉందని సన్నిహితులు వారిస్తున్నార్ట. అయితే బన్నీ మాత్రం అవేం పట్టించుకొనేటట్టు కనిపించడం లేదని, పవన్ ఫ్యాన్స్‌పై తనకున్న ఫీలింగ్‌ని త్వరలోనే బయటపెట్టేస్తాడని చెప్పుకొంటున్నారు. సో.. బన్నీ మరోసారి హాట్ టాపిక్‌కి వేదిక అవ్వబోతున్నాడన్నమాట.