డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన మ‌హేష్‌.

By Gowthami - January 21, 2020 - 13:31 PM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతి హ‌వా త‌గ్గినా - మ‌హేష్ ప్ర‌భంజ‌నం మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. త‌న సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతూనే ఉంది. తాజాగా 200 కోట్ల (గ్రాస్‌)ని కూడా దాటేసింది. అందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. `రియ‌ల్ గ్రాస్‌` అంటూ 200 కోట్ల ఫిగ‌ర్‌ని కోట్ చేసింది. ఇక్క‌డ `మాదే నిజ‌మైన వ‌సూళ్లు` అనే విష‌యం చెప్ప‌క‌నే చెబుతూ.

సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అంటూ విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు మ‌హేష్ అభిమానులు. నేడో, రేపో అలా వైకుంఠ‌పురం నుంచి కూడా ఇలాంటి పోస్ట‌రే వ‌చ్చే అవ‌కాశం ఉంది. వాళ్లెంత ఫిగ‌ర్ వేసుకుంటారో చూడాలి. ఈ అంకెలు నిజ‌మో, కాదో తెలీదు గానీ - ఫ్యాన్స్ మాత్రం ఈ రికార్డుల్ని చూసుకుని పండ‌గ చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS