సినీ స్టార్స్‌కి అభిమానులండడం మామూలే. ఆ అభిమానులు వేలు, లక్షల సంఖ్యలో ఉండడం సర్వ సాధారణమే. అయితే తమ అభిమాన హీరోని అభిమానించడం ద్వారా తమలోని కొత్త కోణాల్ని చూపించే అతికొద్ది మంది అభిమానులుంటారు. అలాంటి అభిమానుల్ని సంపాదించిన హీరో టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్. పవన్‌పై తమకున్న అభిమానాన్ని, ఆ అభిమానులు పవనిజం అనే పేరుతో పిలుచుకుంటారు. ఈ రకమైన అభిమానం పవన్‌కి తప్ప ఇంకే టాలీవుడ్ హీరోకి లేకపోవడం ప్రత్యేకం. అదే ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. హీరోగా స్టార్ డమ్ ఒక ఎత్తు అయితే, వ్యక్తిత్వం మరో ఎత్తు పవన్ కళ్యాన్‌ది. అందుకే ఆయన వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఇదంతా ఎందుకు చెప్పాల్పి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకి బర్త్‌డే విషెస్ చెబుతూ 2.9 మిలియన్స్ పైగా ట్వీట్లు చేశారు అభిమానులు. టాలీవుడ్ హీరోస్‌కి సంబంధించి ఈ సంఖ్య అత్యధికం. ఆ తర్వాత స్థానాన్ని 'బాహుబలి' ప్రబాస్ దక్కించుకున్నారు. ప్రబాస్ బర్త్‌డే సందర్భంగా ఆయనకి వచ్చిన ట్వీట్లు 2.1 మిలియన్లు కాగా, మహేష్ బాబు మూడోస్థానంలోనూ, నాలుగో స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. పవన్ కళ్యాన్ బర్త్‌డేకి 'హ్యాపీ బర్త్‌డే లీడర్ పవన్ కళ్యాన్' అనే హ్యాష్ టాగ్‌తో అభిమానులు ట్వీట్లు వేయడం ప్రత్యేకం. అంటే పవన్‌ని ఓ స్టార్‌గా కాకుండా, లీడర్‌గా చూస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ పెట్టి మూడేళ్లు కావస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటస్తున్నారు.