బిగ్ న్యూస్‌: ప‌వ‌న్‌తో పూరి హ్యాట్రిక్‌

By Gowthami - February 25, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు మామూలుగా లేదు. ఇప్ప‌టికే రెండు సినిమాల్ని ప‌ట్టాలెక్కించేశాడు ప‌వ‌న్‌. హ‌రీష్ శంక‌ర్‌తో మూడో సినిమానీ ఓకే చేయించాడు. ద‌ర్శ‌కుడు డాలీతో కూడా ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు మ‌రో సినిమాకీ ప‌చ్చ జెండా ఊపాడ‌ట‌. ఈసారి ప‌వ‌న్ - పూరి కాంబో సెట్ట‌య్యింద‌ని వార్త‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఓ సినిమా చేస్తున్నాడు పూరి. అది పూర్త‌వ్వ‌గానే ప‌వ‌న్‌తో సినిమా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. `బ‌ద్రి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా అడుగుపెట్టాడు పూరి. ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దాంతో పూరికి వెన‌క్కి తిరిగి చూసుకునే అవ‌స‌రం లేక‌పోయింది.

 

ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబోలో `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` విడుద‌లైంది. ఆ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ స‌మ‌యంలోనే పూరికీ, ప‌వ‌న్‌కీ మ‌ధ్య విబేధాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పుకున్నారు. అయితే... ఇప్పుడు మ‌ళ్లీ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో, ఏ కాంబో సెట్ట‌వుతుందో చెప్ప‌లేం. పూరి - ప‌వ‌న్‌లు నిజంగా క‌లిస్తే.. మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS