'ఫిదా'తో టాలీవుడ్‌ని ఫిదా చేసేసిన బ్యూటీ సాయి పల్లవి. నానితో ఇటీవలే 'ఎంసీఏ' సినిమాతో హిట్ కొట్టి, తాజాగా ఫెస్టివల్ హీరో అయిన శర్వానంద్‌తో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమై తాజాగా సెట్స్ మీదికెళ్లింది. శరవేగంగా షూటింగ్ జరపుకుంటోంది.
'కృష్ణగాడి వీరప్రేమగాధ', 'లై' చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, సెట్స్‌లో సాయి పల్లవి ఎనర్జీకి శర్వానంద్ షాక్ అవుతున్నాడట. అప్పటిదాకా కామ్‌గా ఉండే సాయి పల్లవి కెమెరా ముందుకు రాగానే కంప్లీట్ ఎనర్జీని ప్రదర్శిస్తోందట. టైమ్‌కి సెట్స్‌లోకి రావడం దగ్గర కానీ, యూనిట్ సభ్యుల్ని గౌరవించడంలో కానీ సాయి పల్లవి చాలా గ్రేట్ అనీ సినిమా టీమ్ అంటోంది. సాయి పల్లవి నటిస్తున్న మూడో చిత్రమిది.
తెలుగులో తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. నటనలో సాయి పల్లవి హీరోలను సైతం డామినేట్ చేసేస్తోందనే కాంప్లిమెంట్సే వచ్చాయి. నటనతో పాటు డాన్సుల్లోనూ, సాయి పల్లవి జోరును యంగ్ హీరోలు అందుకోలేకపోతున్నారట. ఇప్పుడు ఆ వంతు శర్వానంద్‌కి వచ్చింది. శర్వానంద్ కూడా మంచి నటుడే. అయితే శర్వానే షాక్ అయ్యేలా చేసిందంటే సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది.
మొదట్లో సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు జోరు పెంచింది. వరుస పెట్టి వస్తున్న ఆఫర్స్‌ని అన్నింటినీ అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగులో మరో యంగ్ హీరో నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో అగ్ర హీరో సూర్యతో ఓ సినిమాలో నటిస్తోంది.