ప‌వ‌న్‌కి బంప‌ర్ ఆఫ‌ర్: 30 రోజుల్లో... 50 కోట్లు.

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ కోసం అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు `పింక్‌` రీమేక్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే.. ప‌వ‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న ఒక్క‌టీ రాలేదు. నిర్మాత‌లు కూడా `మేం ప‌వ‌న్‌తో సినిమా చేస్తున్నాం` అనే విష‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. ప‌వ‌న్ మాత్రం ఈ రెండు సినిమాలూ చేయ‌డం ఖాయ‌మ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు.. ప‌వ‌న్‌కి దిల్ రాజు కూడా అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చాడు.

 

ఈ సినిమాకి రూ.50 కోట్ల పారితోషికం ఇస్తాన‌ని చెప్పాడ‌ట దిల్‌రాజు. కేవ‌లం 30 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే చాలు, 50 కోట్లు వ‌చ్చి ప‌డిపోతాయి. చాలా టెమ్టింగ్‌గా ఉన్న ఆఫ‌ర్ ఇది. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా కాద‌నే ఆస్కార‌మే లేదు. ఈ న‌మ్మ‌కంతోనే దిల్ రాజు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లెట్టేశాడు. అవి ఓ వైపు చురుగ్గా సాగిపోతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగ‌డ‌మే ఆల‌స్యం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS