పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కోసం త్రివిక్రమ్, త్రివిక్రమ్ కోసం పవన్ ఏమైనా చేస్తారు, చేయగలరు. తాజాగా.. పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ పెన్ పట్టుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. `అప్పయ్యముమ్ కోషియమ్` రీమేక్ లో పవన్ నటించడం దాదాపు ఖాయమైపోయింది. అసలు ఈ ప్రాజెక్టులోకి పవన్ అనూహ్య ఎంట్రీ వెనుక ఉన్న ఏకైక హస్తం.. త్రివిక్రమ్ ది. పవన్ తో ఈ సినిమా రీమేక్ చేయించాలని విశ్వ ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. అది ఫలించింది కూడా. ఈ సినిమాలో నటించడానికి పవన్ ఓకే అన్నాడు. అయితే.. పవన్ విధించిన షరతు ఒక్కటే.
ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ రాసివ్వమని అడిగాడట. దానికి.. త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పినట్టు టాక్. పవన్ `తీన్‌మార్` సినిమాకీ త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. ఇప్పుడు ఈ రీమేక్ కోసం పెన్ను పట్టుకుంటున్నాడు. `అల వైకుంఠపురములో` తరవాత.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి త్రివిక్రమ్. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం ఉంది. అందుకే ఆ ఖాళీ సమయాన్ని ఈ విధంగా వాడుకోవాలని త్రివిక్రమ్ కూడా ఫిక్సయ్యాడట.