పవన్ అయితే కుస్తీ సెట్ అవుతుందా?

మరిన్ని వార్తలు

ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలో జోరు ఎక్కువైంది. ఇప్పటికే చాలా రీమేక్ సినిమాలు సెట్స్ పై ఉండగా మరి కొన్ని చిత్రాలు ప్లానింగ్ దశలో ఉన్నాయి. అలాంటి వాటిలో మలయాళం హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్' ఒకటి. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ - రానా దగ్గుబాటిలతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రకు రానా దగ్గుబాటి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

 

అయితే బాలకృష్ణ మాత్రం ఈ సినిమాలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని అంటున్నారు. దీంతో ఒరిజినల్ లో బిజు మీనన్ పోషించిన పాత్రకు సెట్ అయ్యే నటుడి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఈ పాత్ర కోసం రవితేజ ను సంప్రదించారని టాక్ వినిపించింది అయితే తర్వాత పవన్ కళ్యాణ్ పేరు కూడా ఈ మధ్య వినిపిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన కొందరు తెలుగు నెటిజన్లు బిజూ మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ పెద్దగా సూట్ కారేమోనని సందేహాలు వెలిబుచ్చుతున్నారు.

 

బిజు మీనన్ పోషించిన పోలీసు పాత్ర కండ బలం కలిగిన ఓ మాస్ హీరో తరహాలో ఉంటుంది. సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఓ కుస్తీ పోటీ. పవన్ కళ్యాణ్ కుస్తీ పోటీ అంటే పెద్దగా సెట్ కాదని, అదే ఆ క్లైమాక్స్ సీన్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ కింద మారిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే పవన్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ కాబట్టి తన ఇమేజ్ కి చక్కగా సూట్ అవుతుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించే ఈ విషయంపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS