పాయల్‌ రేంజ్‌ పెరుగుతోంది బాస్‌.!

మరిన్ని వార్తలు

'ఆర్ఎక్స్‌ 100' సినిమాతో కుర్రకారుకు సెగలు పుట్టించేసిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కి అవకాశాలు పోటెత్తుతున్నాయట ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌కి. ఆల్రెడీ మాస్‌ రాజా రవితేజ సరసన 'డిస్కోరాజా'లో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. తేజ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న 'సీత' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. 

 

తెలుగులోనే కాదు, ఇతర భాషల నుండి కూడా వస్తున్న అవకాశాల్ని అంది పుచ్చుకుంటోంది. తమిళంలో ఓ సినిమాకి సైన్‌ చేసింది. ఇక కొత్తగా వస్తున్న అవకాశాలకు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోతోందట. అంటే స్టార్‌డమ్‌కి పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంతో దూరం లేదని భావించాలి. అందంతో పాటు, అభినయంలోనూ టాప్‌ అని తొలి సినిమాకే ప్రూవ్‌ చేసుకుంది. 

 

అందంతో, అభినయంతో పాటు అదృష్టం కూడా మెండుగా ఉంది కాబట్టి, ఆఫర్లిలా పోటెత్తుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఈ భామ అదృష్టం కలిసొచ్చి మాస్‌ రాజా సూపర్‌ హిట్‌ కొడితే రవితేజతో పాటు, పాయల్‌కీ తిరుగుండదు. ఇక స్టార్‌ హీరోలకు కూడా పాయల్‌ ఆప్షన్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఆ రేంజ్‌ని పాయల్‌ని అందుకుంటుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS