ఐటెం సాంగ్స్‌కి ఆల్వేస్‌ సై అంటోన్న మిల్కీబ్యూటీ.!

మరిన్ని వార్తలు

హీరోయిన్లు కెరీర్‌ డల్‌ అయిపోయిన తరుణంలో ఐటెం సాంగ్స్‌ వైపు దృష్టి పెడుతుంటారు సహజంగా. కానీ మిల్కీబ్యూటీ తమన్నా స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఐటెం సాంగ్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐటెం సాంగ్స్‌ అంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకోవచ్చు కదా అందుకేనేమో తమన్నా ఐటెం సాంగ్స్‌కి సై అనిందా.? అనే అనుమానం అప్పట్లో కొందరిలో ఉండేది. కానీ తమన్నా అంటే గుర్తొచ్చేది. కళ్లు జిగేల్‌మనే స్కిన్‌టోన్‌, ఆకర్షించే అందంతో పాటు, ఆమె డాన్స్‌ కూడా.

 

ఈ తరం హీరోయిన్స్‌లో టాప్‌ లెవల్‌ డాన్సర్‌ అంటే తమన్నానే అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ డాన్స్‌ల్లో ప్రభువు ప్రభుదేవా ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ తమన్నా. ఐటెం సాంగ్స్‌ని తమన్నా ఎందుకు ఇష్టపడుతుంది అంటే, అందుకేనట. తనకి డాన్స్‌ అంటే ప్రాణం అంటోంది. ఐటెం సాంగ్స్‌లో హీరోయిన్‌ ఎక్స్‌పోజింగే కాదు, డాన్స్‌ కూడా కీలకం. ఆ డాన్స్‌ కోసమే ఐటెం సాంగ్స్‌లో ఎప్పుడు అవకాశమొచ్చినా తాను వదులుకోనని సింపుల్‌గా చెప్పేసింది. 

 

ప్రస్తుతం తమన్నా చాలా బిజీగా గడుపుతోంది. తెలుగులో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తోంది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో లక్ష్మి పాత్రలో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయిన బాలీవుడ్‌ క్వీన్‌ తెలుగు రీమేక్‌ 'దటీజ్‌ మహాలక్ష్మి'లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైనవిగా తమన్నా అభివర్ణిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS