'ఆర్ఎక్స్ 100' సినిమాతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేయడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. సోషల్ మీడియా ఛాటింగ్‌లో ఓ నెటిజన్ పాయల్ రాజ్పుత్ని ఓపెన్‌గా ఓ ప్రశ్న అడిగాడు. ఆర్ఎక్స్ 100లో చాలా చాలా బోల్డ్ సన్నివేశాలున్న సంగతి తెలిసిందే. ఆ సీన్లను మీ అమ్మతో కలిసి చూసినప్పుడు మీరేమైనా ఫీలయ్యారా.? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
అందుకు సమాధానంగా పాయల్ ఆ సీన్లలో నటించినప్పుడు అమ్మతో కలిసి సినిమా చూడాలంటే నేను ఫీలయ్యాను. కానీ అమ్మ ఫీల్ కాలేదు. సినిమాలో భాగంగానే చూసింది.. అని సమాధానమిచ్చింది. ఇకపోతే తొలి సినిమాతో సంచలనం సృష్టించేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నటించే సినిమాలకు కూడా యాక్టింగ్ స్కోపున్న క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటోందట. ఇక గ్లామర్ విషయం అంటారా.? తొలి సినిమాకే అంతలా అందాలారేసేసిన ఈ అందాల భామ ఇక తర్వాతి సినిమాకి చాలా ఎక్స్పీరియన్స్ పొందేసినట్లే.
అయితే ఆ తర్వాత వెంటనే పాయల్‌కి బోల్డ్ సినిమాలకే ఆఫర్స్ వచ్చాయట. కానీ వాటిని సున్నితంగా రిజక్ట్ చేసిందట. కథా బలం ఉంటేనే అలాంటి సీన్స్‌కి అంగీకరిస్తాను తప్ప, అదే పనిగా బోల్డ్ సీన్స్‌లో నటించనని ఖరాఖండిగా చెప్పేసిందట. అందాల ఆరబోత మాత్రమే కాదు, ఆటిట్యూడ్ కూడా ముఖ్యమే అంటోంది మరి మన హాట్ హాట్ పాయల్ రాజ్‌పుత్.