స్టార్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్, తమన్నా వంటి వారు కెరీర్‌ని ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తూనే ఉన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇక మిల్కీబ్యూటీ తమన్నా విషయానికి వస్తే, ఈ మధ్య చాలా ఫెయిల్యూర్స్ చవి చూసింది. కల్యాణ్‌రామ్‌తో 'నా నువ్వే', సందీప్‌కిషన్, నవదీప్ వంటి యంగ్‌స్టర్స్‌తో రెచ్చిపోయి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసేసిన 'నెక్స్ట్ ఏంటీ.?' సినిమాలు తమన్నాని బాగా నిరాశపరిచాయి.
అయితే తాజాగా వచ్చిన 'ఎఫ్ 2' తమన్నాకి ఊరటనిచ్చింది. అగ్ర హీరో వెంకీతో తమన్నాకి కాలం కలిసొచ్చింది. వెంకీ సరసన తమన్నా అందాలకు సరిజోడీ కుదిరింది. దాంతో ఇదే ఫార్ములాని తమన్నా ఫాలో చేయాలనుకుంటోందట. స్టార్ హీరోల సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటోందట. యంగ్‌స్టర్స్‌తో ఛాన్సొస్తే, ఐటెం సాంగ్స్‌కి ఓకే చెప్పడం లేదంటే రిజక్ట్ చేయడం తప్ప, హీరోయిన్‌గా కమిట్ కాకూడదని డిసైడ్ అయ్యిందట. అదే అగ్రహీరోల సినిమాల్లో కోరి మరీ అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాలనుకుంటోందనీ తెలుస్తోంది.
ఈ ఏడాది వెంకీతో 'ఎఫ్ 2' ఇచ్చిన సక్సెస్ కిక్ నెక్స్ట్ చిరంజీవితో 'సైరా' సినిమాలో కంటిన్యూ చేయనుంది తమన్నా. అంతకన్నా ముందే తమన్నా లీడ్ రోల్ పోషించిన 'దటీజ్ మహాలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌ని బట్టి ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. బోనీ అయితే సక్సెస్‌తోనే స్టార్ట్ అయ్యింది మిల్కీబ్యూటీకి. కంటిన్యూ అవుతుందో లేదో చూడాలిక.