గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ పాయల్‌ రాకుమారి.!

By iQlikMovies - January 14, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ రాకుమారి తెలుగులో 'ఆర్ఎక్స్‌ 100' మూవీతో తెరంగేట్రం చేసి, అనూహ్యమైన సంచలనాలు సృష్టించేసింది. కుర్రకారుకు తన అందాల విందుతో గిలిగింతలు పెట్టేసింది. గతేడాది వచ్చిన కొత్త ముద్దుగుమ్మల్లో పాయల్‌ ఓ రేంజ్‌లో కుర్రోళ్లకు కనెక్ట్‌ అయిపోయింది. లేటెస్టుగా వచ్చిన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రంలో కూడా ఈ హాట్‌ బ్యూటీ నటించేసింది. ఇక తర్వాత రవితేజతో ఓ సినిమాలో నటిస్తోంది. 

 

తొలి సినిమాతో పరిచయమయ్యాక వచ్చిన క్రేజ్‌ని సినిమాలతో సంబంధం లేకుండా కంటిన్యూ చేయడమే పనిగా పెట్టుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ మొత్తం హాట్‌ హాట్‌ పిక్స్‌తో నిండబెట్టేయడమే కాకుండా, ఎప్పటికప్పుడే అందాల అప్‌డేట్స్‌ ఇస్తూంటుంది. అలా తాజాగా పాయల్‌ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. రెడ్‌ హాట్‌ పోజులో పాయల్‌ అందాలు కిర్రాక్‌ అనిపిస్తున్నాయంతే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS