ఇది నిజమేనా రామా.!

మరిన్ని వార్తలు

సంక్రాంతికి విడుదలైన రామ్‌చరణ్‌ మూవీ 'వినయ విధేయ రామ' నుండి కొన్ని సీన్స్‌ లేపేశారు. దాంతో సినిమా ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పెద్దగా లేదు కానీ, యాక్షన్‌ సీన్స్‌, డాన్సులు పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్స్‌ అన్నీ వెరసి ఇదో పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా కనిపిస్తోంది. పండగ సీజన్‌ అయిపోయింది. నిజానికి ఈ రోజు డెత్‌ డే అనుకున్నారు వసూళ్ల పరంగా, షేర్స్‌ క్లోజ్‌ అయిపోతాయనుకున్నారు.

 

కానీ ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది 'వినయ విధేయ రామ'. ఇక బీ,సీ సెంటర్స్‌లో వసూళ్లు బాగా పెరిగాయి. ఈ రోజు, రేపు నిలబడగలిగితే రేపట్నుంచి మళ్లీ వీకెండ్‌ స్టార్ట్‌ కానుంది. సో వసూళ్లు పుంజుకునే అవకాశాలు లేకపోలేవు. ఇకపోతే ఓవర్సీస్‌లో ఈ సినిమా డిజాస్టర్‌. ఇందులో డౌట్‌ లేదు. అవమానకరమైన డిజాస్టర్‌ అక్కడ.

 

తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే మాత్రం డిజాస్టర్‌ నుండి తప్పించుకుంది. డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని ఓ సినిమా 50 కోట్లు పైన వసూళ్లు సాధించడం అంటే అది చిన్న విషయం కాదు, ఇక నుండి వచ్చే ప్రతీ రూపాయి నష్టాల్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌కి జోడీగా కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ హాట్‌ ఐటెం ఈషా గుప్తా స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS