పవన్ 'కొడకా కోటేశ్వరరావు' పైన పోలీస్ కేసు..!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం విడుదల కాకముందే పలురకాల వివాదాల్లో నిలుస్తుంది. ఈ మధ్యనే ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం ఫ్రీమేక్ అంటూ దానికి సంబంధించి ఫైన్ కూడా కట్టారు అంటూ  వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇదిలావుండగా అజ్ఞాతవాసి విడుదలకి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాట పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే- కొడకా కోటేశ్వరరావు బదులుగా కొడకా చిరంజీవి, కొడకా అల్లు అర్జున్, కొడకా త్రివిక్రమ్ అని ఎందుకు పాడలేదు అని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల కోటేశ్వరరావు పేరు కలిగిన వారి మనోభావాలు దెబ్బతింటాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఈ సినిమా విడుదలకి ముందే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది.

ఇక ఈ ఫిర్యాదు పైన అజ్ఞాతవాసి టీం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS