గ్లామ్‌షాట్‌: 'వెడ్డింగ్‌ టైమ్స్‌'లో హాట్‌ అండ్‌ స్పైసీ 'గోపికమ్మ'.!

మరిన్ని వార్తలు

ఫెమినా వెడ్డింగ్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ కోసం ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇలా హాట్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. త్వరలో 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న పూజా హెగ్దే మొన్నా మధ్య బికినీలతో వరుసగా కుర్రకారు గుండెల్లో ప్రేమ గంటలు మోగించేసింది. ఇటీవల 'అరవింద'గా ఎన్టీఆర్‌ సరసన కనిపించి, టిపికల్‌ డైలాగ్స్‌తో ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. 

 

ప్రబాస్‌తో డార్లింగ్‌ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగనుంది. ఇప్పుడు మాత్రం 'చోటీ చోటీ బాతే మీటీ మీటీ యాదే..' అంటూ ఓ పక్క అల్లరి నరేష్‌తో, ఇంకో పక్క మహర్షి మహేష్‌తో ఫ్రెండ్‌షిప్‌ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేస్తోంది. ఆలోగా సోషల్‌ మీడియాలో 'ఫెమినా' పేరు చెప్పి ఇదిగో ఇలా స్పైసీ గ్లామర్‌తో హీటు పుట్టించేస్తోంది. 'రాక్‌ క్యాండీ', 'కల్చర్‌ బీట్‌..' అంటూ కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టేస్తోన్న పూజాహెగ్డే పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS