మహర్షి' స్పీడులో ఏమాత్రం తగ్గట్లేదు.!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' సినిమా విడుదల తేదీలో కాస్త సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే చిత్రయూనిట్‌ మాత్రం అనుకున్న తేదీకి సినిమాని విడుదల చేస్తామని నమ్మకంగా చెబుతోంది. విడుదలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదనీ, ప్రూఫ్‌గా 'మహర్షి' డబ్బింగ్‌ పనులు మొదలైన విషయాన్ని తెలియజేసింది చిత్రయూనిట్‌. ఈ విషయంలో దిల్‌రాజు చాలా తెలివిగా వ్యవహరించినట్లే. 

 

మామూలుగా అయితే ఈ విషయాన్ని ప్రస్థావించాల్సి అవసరం లేదు. అయితే ఇక్కడ కూడా కాస్త మార్కెటింగ్‌ తెలివితేటలు ప్రదర్శించాడు దిల్‌రాజు. ఇకపోతే ఈ కారణంగా అల్లరి నరేష్‌ పాత్రకు సంబంధించి అప్‌డేట్‌ ఒకటి వచ్చినట్లైంది. అల్లరి నరేష్‌ ఈ పాత్రలో మహేష్‌కి స్నేహితుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా చిత్రయూనిట్‌ దిగిన ఫోటోలో అల్లరోడు గెడ్డంతో కనిపిస్తున్నాడు. 

 

అంటే సినిమాలో కూడా గెడ్డంతో కనిపించబోతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. చదువుకునే రోజుల్లో ప్రాణ స్నేహితులుగా ఉండి, తర్వాత విడిపోయి, పేదరికంతో పల్లెటూరిలోనే ఉండిపోయే రైతు పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నాడీ సినిమాలో. ఇదిలా ఉంటే మొత్తానికి 'మహర్షి' సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందని అయితే క్లారిటీ వచ్చేసింది. అంటే ఇక విడుదలకు సిద్ధంగా ఉన్నట్లే. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS