సప్తగిరి 'అల్లరి' అదిరింది.!

మరిన్ని వార్తలు

ఓ సూపర్‌హిట్‌ సినిమాలోని సీన్‌ తీసుకుని దానికి స్పూఫ్‌ చేయడం ఎప్పటి నుండో జరుగుతున్నదే. అయితే ఈ విషయంలో అందరికంటే ముందుండేవాడు అల్లరి నరేష్‌. కామెడీ అంటే స్పూఫ్‌ మాత్రమే అనే స్థాయికి ఆ ట్రెండ్‌ని తీసుకెళ్లిపోయాడు. అలా కొన్ని సంచలన విజయాలు అందుకున్నాడు. కానీ తర్వాత తర్వాత ఆ ప్రయోగం బెడిసికొట్టింది. ఈ మధ్య స్పూఫ్‌ల్ని కొంత పక్కన పెట్టాడు అల్లరి నరేష్‌. 

 

ఆ లోటు పూడ్చడానికి అన్నట్లుగా కమెడియన్‌ సప్తగిరి తన కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. 'వజ్ర కవచధర గోవిందా' అనే టైటిల్‌తో సప్తగిరి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'ఆది' నుండి 'బాహుబలి' దాకా పలు సినిమాల్లోంచి సన్నివేశాల్ని తీసుకుని వాటిని స్పూఫ్‌ చేసేశారు. కత్తికి పదును పెడుతుంటే, వచ్చే నిప్పు రవ్వల్ని తాగేస్తాడు హీరో. 

 

ఇంకో సన్నివేశంలో 'నేనెక్కడికి వెళ్లినా నా కోసం, నన్ను చంపడం కోసం బోలెడంత మంది వచ్చేస్తున్నారు..' అంటాడు. టీజర్‌ మాత్రం చాలా బాగా పేలింది. సప్తగిరి చేసిన అల్లరి అంటూ ఈ సినిమాకి నెటిజన్ల నుండి స్పందన బాగా వస్తోంది. సినిమాకి పెద్దగా ఖర్చేం అయ్యుండకపోవచ్చు. కాబట్టి, కడుపుబ్బా నవ్వించగలిగితే మళ్లీ సప్తగిరి పంట పండినట్లే. త్వరలో ఈ సినిమా ప్రేక్షకలు ముందుకు రాబోతోంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS