ఇటీవలే 'జిగేల్ రాణీ మీ కళ్లు జిగేల్ మనిపించడానికి వచ్చేస్తోంది..' అంటూ సోషల్ మీడియాలో ముద్దు ముద్దుగా వయ్యారాలు పోయి, 'రంగస్థలం' సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి, నిజంగానే జిగేల్ రాణీగా జిగేల్మనిపించేసింది హాట్ బ్యూటీ పూజా హెగ్దే.
సినిమా సూపర్ హిట్ అయ్యింది. జిగేల్ రాణికిక తిరుగే లేదు. స్పెషల్ సాంగ్‌లో ఫస్ట్ అటెంప్టే ఇంత కిక్కిచ్చేసింది ఈ ముద్దుగుమ్మకి. సినిమా ఓ రేంజ్ హిట్. ఇక హీరోయిన్గా నెక్ట్స్ పూజా చేతిలో ఉన్న బిగ్ ప్రాజెక్ట్స్‌కి ఈ 'రంగస్థలం' బోనీ అదిరిపోయింది.ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా పూజా హెగ్దే జిమ్‌లో టిపికల్ కసరత్తులు చేస్తూ చిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్దే ఫిట్‌గానే ఉంటుంది కదా. ఎందుకీ కసరత్తులు అంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. తన జీరో సైజ్ గ్లామర్‌కి ఇంకెందుకు మరింత మెరుగులు అంటున్నారు.
అయితే ఈ ఫోటో పోస్ట్ చేసి, పూజా 'టేకింగ్ బేబీ స్టెప్స్..' అంటూ కామెంట్ పెట్టింది. అంటే ముందు ముందు ఇంకా ఇలాంటి కసరత్తులు చాలానే చేస్తాను అని చెప్పకనే చెప్పినట్లుందీ భామ. ప్రస్తుతం మహేష్, ఎన్టీఆర్, ప్రబాస్ వంటి స్టార్ హీరోస్తో జోడీ కడుతోంది పూజా హెగ్దే. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కోసం పూజా అతి త్వరలోనే సెట్స్‌లో సందడి చేయనుంది.
ఈ సినిమాలో సన్నజాజి తీగలాంటి పూజా గ్లామర్‌ని మ్యాచ్ చేసేందుకు ఆల్రెడీ ఎన్టీఆర్ దాదాపు 12 కిలోల వరకూ బరువు తగ్గాడట. ఇక మహేష్, ప్రబాస్లకు ఆ అవసరం ఎలాగూ లేదాయె. అసలింతకీ మన నాజూకు పూజాకి ఏమంత అవసరమొచ్చిందబ్బా.!