రాజశేఖర్‌ హీరోయిన్‌కీ, కమల్‌ హాసన్‌కీ డాష్‌ డాష్‌ ఏంటీ?

మరిన్ని వార్తలు

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో రాజశేఖర్‌ నటించిన 'గరుడవేగ' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పూజా కుమార్‌. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. పూజా కుమార్‌ పాత్రకూ మంచి మార్కులు పడ్డాయి. కానీ, ఎందుకో ఆ తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేదు పూజా కుమార్‌. అయినా, సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేయాలనుకుంటుంది పూజా కుమార్‌. ఆమె స్క్రీన్‌పై కనిపించిన పాత్రల్లో ఎక్కువగా సాంప్రదాయమైన గృహిణి పాత్రలే కావడం విశేషం. తెరపై హుందాగా కనిపించేందుకే ఎక్కువగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. చేతిలో పెద్దగా సినిమాలేం లేవు కదా..ఎందుకంటారా? సినిమా టాపిక్‌ కాదులెండి.

 

పర్సనల్‌ టాపిక్కే. విశ్వనటుడు కమల్‌ హాసన్‌తో ఏకంగా మూడు సార్లు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న పూజా కుమార్‌.. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చెలామణీ అవుతున్నారని ఈ మధ్య బయటకొచ్చిన కొన్ని ఫోటోల ద్వారా అర్ధమవుతోంది. ఇంకేముంది.. ఇలాంటి పిక్స్‌ దర్శించినాక, నెటిజన్లు ఊరికే ఉండరు కదా. కమల్‌ హాసన్‌తో, పూజా కుమార్‌కి సమ థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ వార్తలు పుట్టించేస్తున్నారు. దాంతో కమల్‌ - పూజా జంట ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటికే కమల్‌తో రిలేషన్‌ షిప్‌, బ్రేకప్‌ అంటూ మాట్లాడుకునే ముద్దుగుమ్మల లిస్టు పెద్దగానే ఉంది. ఆ లిస్టులోకి తాజాగా పూజా కుమార్‌ కూడా జాయిన్‌ అయ్యిందా.? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS