ఆమెకి భలే ఛాన్సులే: ఇది ఒక 'విచిత్రం'

మరిన్ని వార్తలు

'మాయా జాలం', 'ఒక విచిత్రం' తదితర చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ పూనమ్‌ కౌర్‌. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు ఈ బ్యూటీకి. అలా ఆడియన్స్‌ ఈ ముద్దుగుమ్మని దాదాపుగా మర్చిపోయారు. 

ఈ టైంలో ఓ వివాదంతో మళ్లీ పూనమ్‌ కౌర్‌ వెలుగులోకి వచ్చింది. ఆ వివాదం ఏంటంటే, పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌తో కలిసి పూనమ్‌ కౌర్‌ క్షుద్రపూజలు చేయిస్తోందట.. అని సినీ విమర్శకుడు మహేష్‌ కత్తి అన్నాడు. అలాగే పవన్‌ పేరు చెప్పే, ఆంధ్రప్రదేశ్‌లో చేనేత పరిశ్రమకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పూనమ్‌ కౌర్‌ ఎంపికయ్యిందట.. ఈ మాట కూడా ఆయనే చెప్పారు. అయితే ఇంతకు ముందు మహేష్‌ కత్తి, పవన్‌పై విమర్శలు చేస్తున్నప్పుడు పూనమ్‌ కౌర్‌ స్పందించిందట. అయితే ఆ సందర్భంలో మహేష్‌ కత్తి పేరు చెప్పకుండానే పూనమ్‌ స్పందించింది. అక్కడితో ఈ వివాదం స్టార్ట్‌ అయ్యింది. 

ఈ వివాదం వల్ల తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతోందంటూ, ఈ వివాదం నుండి తననెలాగైనా రక్షించాలంటూ పూనమ్‌కౌర్‌, పవన్‌ కళ్యాణ్‌ని వేడుకుంటోందట. సరే, ఈ వివాదం సంగతి పక్కన పెడితే, పబ్లిసిటీ పరంగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోంది. దాంతో సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయట. అందానికి అందం, అభినయానికి అభినయం ఉన్న గ్లామరస్‌ బ్యూటీ పూనమ్‌ కౌర్‌. ఎప్పుడు ఎవరికి అదృష్టం ఎలా తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలీదు. 

ఇప్పుడు ఆ అదృష్టం పూనమ్‌ని వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. ఓ ప్రముఖ హీరో సినిమాలో పూనమ్‌కి ఛాన్స్‌ దక్కిందంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. అయితే ఆ ఛాన్స్‌ హీరోయిన్‌గానా? లేక గతంలో ఓ సినిమాలో గోపీచంద్‌ చెల్లెలి పాత్రలో నటించినట్లుగా చెల్లెలి పాత్రనా? అనే విషయం తేలాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS