ఆ పోర్న్‌ స్టార్‌కి పెళ్లయిపోతోందోచ్‌.!

By Inkmantra - March 19, 2019 - 11:50 AM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ స్టార్‌గా సన్నీలియోన్‌కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేయడం, స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని దత్తత తీసుకోవడం.. ఇప్పుడు సౌత్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టి ఆ అభిమానాన్ని మరింత విస్తరించుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్‌. ఇక సన్నీ కంటే ముందే పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన మియా ఖలీఫాకి కూడా ఫాలోయింగ్‌ అదే రేంజ్‌లో ఉంది. 

 

ఈ హాట్‌ భామ కూడా ఈ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మియా ఖలీఫా పెళ్లి చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్‌ ఉన్న మియా ఖలీఫా తన పెళ్లి విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. అంతా కాసేపు షాకైనా తర్వాత రిలాక్స్‌ అయ్యి, వరుడెవరు..? అని ప్రశ్నించారు. పోర్న్‌ స్టార్‌గా ఓ ఊపు ఊపేసిన మియా ఖలీఫా ప్రస్తుతం బిజినెస్‌లోనూ బిజీగా ఉంది. 

 

ఓ స్టార్‌ హోటల్‌ని రన్‌ చేస్తోంది. ఆ హోటల్‌లో ఛెఫ్‌గా పని చేస్తున్న రాబర్ట్‌ శాండ్‌ని వివాహమాడుతున్నట్లుగా మియా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. గత కొంతకాలంగా రాబర్ట్‌తో మియా లవ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ, త్వరలో వివాహం చేసుకోబోతున్నామనీ తెలిపింది. ఇదిలా ఉంటే, ఈ మధ్య ఓ తమిళ సినిమాలో మియా ఖలీఫా నటిస్తోందంటూ గాసిప్స్‌ వచ్చాయి. కానీ అది నిజం కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS