మలయాళంలో సన్నీ తళుకులు.!

By iQlikMovies - January 25, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా ఐటెం గాళ్‌గా సత్తా చాటిన హాట్‌ భామ సన్నీలియోన్‌. బాలీవుడ్‌లో ఉన్నప్పుడే సౌత్‌ ఆడియన్స్‌లో కూడా ఈ బ్యూటీ తెగ క్రేజ్‌ సంపాదించేసింది. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఇప్పుడు సౌత్‌ సినిమాలపై బాగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తోంది. గతంలో ఒకటీ అరా ఐటెం సాంగ్స్‌తో మురిపించిన సన్నీలియోన్‌ సౌత్‌లో పూర్తి స్థాయి హీరోయిన్‌గా తళుకులు చూపించాలనుకుంటోంది. 

 

ఆ దిశగా సన్నీ హీరోయిన్‌గా సౌత్‌లో స్టోరీలు కూడా ప్రిపేర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ 'వీరమహాదేవి' టైటిల్‌తో తెలుగు, తమిళ, మలయాళంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే, మలయాళంలో సన్నీలియోన్‌ హీరోయిన్‌గా 'రంగీలా' అనే మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సన్నీలియోన్‌ 'రంగీలా' మూవీలో నటిస్తున్నానన్న సంగతిని స్వయంగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. 

 

వచ్చే నెల్లో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందట. సంతోష్‌ నాయర్‌ దర్శకుడు. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్‌ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మధుర రాజా' సినిమాలో సన్నీలియోన్‌ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తెలుగులోనూ సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్కనుందని టాక్‌ వినిపిస్తోంది. గతంలో హాట్‌ ఐటెం బాంబ్‌ ముమైత్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు సన్నీ హవా నడుస్తుందేమో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS