మళ్లీ ముద్దుల జాతర తప్పేలా లేదు.!

By Inkmantra - March 18, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమాతో లిప్‌లాక్స్‌ ట్రెండ్‌ని పరిచయం చేసిన హీరో విజయ్‌ దేవరకొండ అయితే ఆయనని మించి ముద్దుల పండగ చేసుకున్న హీరో కార్తికేయ. 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో ఘాటు ముద్దులతో కుర్రోళ్లని పిచ్చెక్కించేశాడీ యంగ్‌ హీరో. ఆ ముద్దుల ధాటికి హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ని వరుస ఆఫర్లు వరించేయగా, 'ఆర్‌ ఎక్స్‌ 100' తర్వాత కార్తికేయ హీరోగా ఓ సినిమాలోనూ, విలన్‌గా ఇంకో సినిమాలోనూ నటిస్తున్నాడు. 

 

విలన్‌ సంగతి పక్కన పెడితే, హీరోగా నటిస్తున్న 'హిప్పీ' చిత్రంలో మనోడు మళ్లీ హాట్‌ హాట్‌ రొమాన్స్‌ చేసేసేలానే ఉన్నాడండోయ్‌. ఈ సినిమా టీజర్‌ ఈ నెల 20న రాబోతోందని ప్రకటించి, చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. హీరోయిన్‌తో హీరో దగ్గరగా కలిసి ఉన్న స్టిల్‌ అది. అంటే ముద్దుకు కొన్ని నిముషాల దూరమన్నమాట. ఈ స్టిల్‌ రిలీజ్‌ చేసి ముద్దు సన్నివేశాలు ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉంటాయనే సంకేతాలు పంపించేశాడీ రొమాంటిక్‌ హీరో. 

 

టి.ఎన్‌.కృష్ణ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో కార్తికేయతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్న ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవన్షీ. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే, మనోడు విలన్‌గా తన టాలెంట్‌ ప్రదర్శించేందుకు సిద్ధపడుతున్న సినిమా 'గ్యాంగ్‌లీడర్‌'. నేచురల్‌ స్టార్‌ నాని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS