Prabhas: ప్రభాస్ కు ఢిల్లీ నుండి ఆహ్వానం

మరిన్ని వార్తలు

దిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక రావణ దహనం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు రామ్‌లీలా కమిటీ సభ్యులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి గతంలో అజయ్‌దేవగణ్‌ పాల్గొనగా ఈ ఏడాది ప్రభాస్‌ని ఆహ్వానించినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఓం రౌత్‌ దర్శకత్వంలో రానున్న ఆదిపురుష్‌ లో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు.

 

ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయేలా ఇప్పుడు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ కనిమ టీజర్ నే విడుదల చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యేంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ఏకధాటిగా కొనసాగనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS