ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో షేక్ చేస్తున్న వార్త ఇది. అయితే.. ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణెని కథానాయికగా ఎంచుకున్నారు. వీరిద్దరి పారితోషికం మరో 50 కోట్లని సమాచారం. అంటే.. ఈ ముగ్గురికీ 150 కోట్లు ముట్టజెబుతున్నారన్నమాట.
అశ్వనీదత్ ఈ సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ కేటాయించాడు. సగం బడ్జెట్.. ఈ ముగ్గురికే సరిపోతోంది. మిగిలిన 150 కోట్లతో సినిమా తీస్తారన్నమాట. మేకింగ్ కి సగం, పారితోషికాలకు సగం అంటే... స్టార్ డమ్ కి ఇస్తున్న వాల్యూ ఏమిటో అర్థం అవుతోంది. అమితాబ్ బచ్చన్ ది ముందు అతిథి పాత్ర అనుకున్నారు.కానీ.. ఆ పాత్ర నిడివి పెరుగుతూ వెళ్లిందట. అందుకే భారీ మొత్తం పారితోషికం ముట్టజెప్పారని తెలుస్తోంది. బిగ్ బి ఉండడం వల్ల నార్త్ మార్కెట్ లో ఈ సినిమా వాల్యూ పెరుగుతుంది. అందుకే.. బిగ్ బికి ఆ స్థాయిలో పారితోషికం కట్టబెడుతున్నారు.