తూచ్.. ప్రభాస్ సినిమా సోషియో ఫాంటసీ కాదట!

By Inkmantra - June 15, 2020 - 13:07 PM IST

మరిన్ని వార్తలు

డార్లింగ్ ప్రభాస్ ఈమధ్య అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నారు. ఈమధ్యే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మాణంలో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీగా ఓ అంతర్జాతీయ చిత్రం స్థాయిలో రూపొందిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా కథ గురించి చాలా రోజుల నుంచి ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

 

ఇది 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరహాలో ఓ సోషియో ఫాంటసీ చిత్రమని, ప్రభాస్ ఓ దేవకన్యకు మానవుడికి జన్మించిన అబ్బాయి అని, ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాడని అన్నారు. ఇక కొందరైతే ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పారు. అయితే ఫ్రెష్ టాక్ ఏంటంటే ఈ సినిమా మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. దీని కోసం నిర్మాతలు హైదరాబాద్ లో మూడవ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో ఊహించి దానికి తగ్గట్టుగా భారీగా సెట్ వేయడానికి రెడీ అవుతున్నారట. ఈ సినిమాలోన కీలకమైన సీన్లను ఈ సెట్స్ లోనే చిత్రీకరణ జరుపుతారట.

 

అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలు వెల్లడవుతాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS