డార్లింగ్‌ స్పీడుకు బ్రేకుల్లేవ్‌!

By iQlikMovies - June 09, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమా తర్వాత అదే అంచనాలతో తెరకెక్కుతోన్న 'సాహో'లో నటిస్తున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో UV క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న 'సాహో' చిత్రం దాదాపు చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చేసింది. ఓ పాట మినహా మిగిలిన షూటింగ్‌ అంతా కంప్లీట్‌ అయిపోయిందట. ఓ వైపు షూటింగ్‌ నడుస్తుండగానే, డబ్బింగ్‌ పనులు కూడా వేగంగా పూర్తి చేశారట. ఈ మధ్య మ్యూజిక్‌ విషయంలో నెలకొన్న సందిగ్థత కూడా తీరిపోవడంతో, 'సాహో' అనుకున్న టైంకి అనగా ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా విజయవంతంగా రిలీజ్‌ కానుందనీ తాజాగా కన్‌ఫామ్‌ అయ్యింది. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ ఈ సినిమాలో ప్రబాస్‌తో జోడీ కడుతోంది. ఇక 'సాహో' సంగతిటుంచితే, ప్రబాస్‌ 'సాహో'కి సమాంతరంగా 'జిల్‌' ఫేం రాధాకృష్ణ కాంబోలో ఇంకో సినిమానీ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఆల్రెడీ నాలుగైదు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీలోనూ యాక్షన్‌ మామూలే, అయితే, గతంలో ప్రబాస్‌ నటించిన హిట్‌ మూవీ 'డార్లింగ్‌' మాదిరి క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రబాస్‌ జోరు చూస్తుంటే, 'బాహుబలి'తో తీసుకున్న గ్యాప్‌ని ఈ రెండు సినిమాలతో ఫుల్‌ఫిల్‌ చేసేలానే కసి మీదున్నట్లు కనిపిస్తున్నాడు. దాదాపు కొన్ని నెలల గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ విడుదల కాబోతున్నాయట. ఈ సినిమాకి 'జాన్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS