కొత్త సినిమా టైటిల్‌పై క్లారిటీ ఎప్పుడు..?

By iQlikMovies - October 12, 2018 - 09:50 AM IST

మరిన్ని వార్తలు

'సాహో' సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాని మొద‌లెట్టి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు ప్ర‌భాస్. సినిమా త‌ర‌వాతే సినిమా అనే సిద్దాంతాన్ని తొలిసారి ప‌క్క‌న పెట్టి - డ‌బుల్‌బొనాంజా ఇవ్వ‌డానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు అంద‌రి దృష్టీ.. ప్ర‌భాస్ కొత్త సినిమాపైనే ఉంది. అందులోని ప్ర‌భాస్‌గెట‌ప్ గురించీ, టైటిల్‌గురించి జ‌నాలు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం రెండు టైటిళ్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.  'అమూర్‌' అనే ఫ్రెంచ్ టైటిల్‌ని ఈ సినిమా కోసం అనుకుంటున్నార‌ని, 'జాన్‌' అనే మ‌రో పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాక్‌. ఈ రెండిటిలో 'జాన్‌' టైటిల్ వైపే చిత్ర‌బృందం మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయి.

ఎందుకంటే 'జాన్‌' అనే ప‌దం.. ఇక్క‌డ తెలుగువారికీ ప‌రిచ‌య‌మే. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. రెండు చోట్లా ఒకే టైటిల్‌తో విడుద‌ల అవ్వాల‌ని ప‌ర‌భాషా టైటిళ్ల‌ని ప‌రిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేస్తార‌న్న‌ది తెలుసుకోవాలంటే ఈనెల 23 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే ఆ రోజు ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.

పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం యూర‌ప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS