మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిత్రం రంగస్థలంతో ఒక అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్ల (గ్రాస్) పై చిలుకు ఆర్జించినట్టుగా తెలిసింది.
ఇదే సమయంలో ఈ సినిమాకి ఓవర్సీస్ లో మరి ముఖ్యంగా అమెరికాలో కలెక్షన్స్ హవా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ సినిమాకి అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టుగా అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదే విషయాన్నీ మైత్రి మూవీమేకర్స్ సంస్థ కూడా దృవీకరించింది. దీనితో ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల తన సత్తా చూపిస్తూ బాక్స్ ఆఫీసుల వద్ద కొత్త కొత్త రికార్డులు లిఖిస్తున్నది. ఈ సినిమాని పంపిణీ చేసిన పంపిణీదారులు సైతం తమకి వచ్చిన లాభాలతో సంతోషంగా ఉండడం ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు.
ఇక రంగస్థలం తరువాత విడుదలైన భరత్ అనే నేను కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు ఆర్జీస్తుండడం తెలుగు చిత్ర పరిశ్రమకి ఆనందాన్నిచ్చే విషయం.