చేసిన తప్పు తెలిసివచ్చింది అంటూ బుల్లితెర ప్రముఖ యాంకర్ అయిన తప్పతాగి వాహనం నడపడంపై ఇప్పటికే వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. ఎట్టకేలకు ప్రదీప్ ఈ కేసులో పోలీసుల కౌన్సిలింగ్‌కి ఈ రోజు హాజరయ్యాడు.
డిశంబర్ 31న డ్రింకింగ్ చేసి, డ్రైవింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు ప్రదీప్. బుకాయించడానికి కూడా వీలు లేకపోయింది. ఇప్పుడు కౌన్సిలింగ్‌కి తన తండ్రిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ వివాదం అతనిలో చాలా పరివర్తన తెచ్చిందట. ఈ సందర్భంగా ప్రదీప్ ఓ స్టన్నింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై ఎప్పుడూ మధ్యం సేవించి వాహనం నడపబోనని, తప్పు చేశాననీ ఒప్పుకుంటున్నాననీ, తనలా ఎవరూ చేయవద్దనీ ప్రదీప్ ఇంకోసారి చెప్పాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ మధ్యం తననీ తప్పు చేయించిందో దాన్ని తానైతే ఇకపై ముట్టననీ తనకు తానుగా ప్రదీప్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదే నిజమైతే గనుక, చేసిన తప్పును ఒప్పుకున్నందుకే కాదు, మద్యం మహమ్మారిని దూరంగా వుంచాలనుకుంటున్నందుకు ప్రదీప్‌ని అభినందించి తీరాల్సిందే. తప్పు చేయడం మానవ సహజం. ఆ తప్పును ఒప్పుకుని, సరిదిద్దుకునే మార్గంలో నడవడం అసలు సిసలు పశ్చాత్తాపం అని చెప్పాలి. అదే ప్రదీప్ ఇప్పుడు చేస్తున్నాడు.
బుల్లితెర మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ పేరు మొదటి వరసలో ఉంటుందని చెప్పొచ్చు. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో బుల్లితెరపై బోలెడంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో మెప్పిస్తుంటాడు. యాంకర్‌గా పాపులరైన ప్రదీప్ ఇప్పుడు ఈ వివాదం కారణంగా వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు.