క్లాసిక్ బ్యూటీగా తెలుగు తెరకు పరిచయం అయింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. 'కంచె' సినిమాతో అందంగా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా అమ్మడిని అలాంటి ఛాన్స్‌లే పలకరించాయి. అయితే ఇప్పుడు ప్రగ్యా అలా కాదు. చాలా మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచేసింది. ఇంతవరకూ అంతగా డాన్స్ చేసే అవకాశం కూడా రాలేదు ఈ ముద్దుగుమ్మకి. కానీ ఇప్పుడు ఓవర్ డోస్ గ్లామర్‌తో డాన్స్ ఇరగదీసేసింది. ప్రగ్యా సూపర్బ్ డాన్సర్. ఆ విషయం ఇదిగో లేటెస్ట్ మూవీ 'జయ జానకీ నాయకా' సినిమా ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం ఇరగదీసి స్టెప్పులేసేసింది ప్రగ్యా. వరుసగా ఛాన్సులొస్తున్నాయి, కానీ హిట్టే ఆమెకు మొహం చాటేస్తోంది. అందం, అభినయం, డాన్సింగ్ టాలెంట్. అన్నీ ఉన్నా ఆ ఒక్క అదృష్టం కలసిరావడంలేదు. 'జయ జానకి నాయక' సినిమాపై ఈ ముద్దుగుమ్మ చాలా ఆశలే పెట్టుకుంది. ప్రగ్యా నటించిన 'నక్షత్రం'నీ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా నిరాశపర్చింది. ఆ సినిమా కోసం రిస్కీ స్టంట్స్ కూడా చేసేసింది పాపం. బికినీ కూడా ధరించి గ్లామర్ ఒలకబోసేసింది. ఆ సినిమాలో ప్రగ్యాని అలా చూసిన వారంతా షాక్ తిన్నారంటే, ఇప్పుడు 'జయ జానకి నాయాకా' సినిమాలో ప్రగ్యాని చూసి మరింత షాక్ తింటారట. తన క్యారెక్టర్ అలా ఉండబోతోందట. లేటెస్టుగా ఈ సినిమా నుండి ఓ సాంగ్ వీడియో బయటికి వచ్చింది. ఆ సాంగ్‌లో ప్రగ్యా హాట్ హాట్ డాన్స్‌కి అంతా ఫిదా అయిపోతున్నారు మరి. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.