పృధ్వీరాజ్ సుకుమారన్ మలయాళం సూపర్ స్టార్. నటుడిగా దర్శకుడిగా తన సినిమాలు ఉన్నత స్థాయిలో వుంటాయి. ఆయన ఇప్పుడు తెలుగు మార్కట్ పై ద్రుష్టి పెట్టారు. తన కడువా చిత్రాన్ని ఇక్కడ కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. జూన్ 30న రిలీజ్ అనుకున్నారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. టీజర్ లాంచ్ చేసి మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు.
అయితే అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రాన్ని జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ లో వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనేన్ అందరూ హైదరాబాద్ తరలివచ్చారు. అదే వేడిలో సినిమా వచ్చేస్తుంటే ఒక పని అయిపోయేది. అయితే ఇప్పుడు వాయిదా పడింది. ఈ రోజుల్లో ప్రమోషన్స్ కూడా బాగా ఖర్చు అవుతున్న సంగతి తెలిసిందే. కడువా తెలుగు రిలీజ్ కోసం మరో ఈవెంట్ ని ప్లాన్ చేస్తారేమో చూడాలి.