బ‌న్నీతో సినిమా... అందుకే వ‌దిలేసింద‌ట‌!

By iQlikMovies - January 22, 2019 - 18:47 PM IST

మరిన్ని వార్తలు

ప్రియా వారియ‌ర్‌. ఈ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో.  ఒకే ఒక్క‌సారి క‌న్నుగీటి... దేశంలోని కుర్ర‌కారు హృద‌యాల్ని ఒక్క‌సారిగా కొల్ల‌గొట్టేసింది. ఆ వీడియో ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ ఒక్క వీడియోతోనే ప్రియా వారియ‌ర్‌కి బోలెడ‌న్ని అవ‌కాశాలు వ‌చ్చాయి కూడా. అల్లు అర్జున్‌తో న‌టించే ఛాన్స్ కూడా ద‌క్కించుకుంది. 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'లో ప్రియా వారియ‌ర్‌ని క‌థానాయిక‌గా ఎంచుకుందామ‌నుకున్నారు. కానీ.. కుదర్లేదు.

 

బ‌న్నీతో న‌టించే ఛాన్స్ ఎలా పోయింది?  అనే ప్ర‌శ్న‌కు ప్రియా వారియ‌ర్ ఇప్పుడు స‌మాధానం చెప్పింది. ''అల్లు అర్జున్‌తో న‌టించే ఛాన్స్ వ‌చ్చిన మాట నిజ‌మే. కానీ ఆ స‌మయానికి  'ఒరు అడార్‌ లవ్‌’' అనే సినిమాలో న‌టిస్తున్నాను. కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌డం కుద‌ర్లేదు. అందుకే దాన్ని వ‌దులుకోవాల్సివ‌చ్చింది'' అని చెప్పుకొచ్చింది ప్రియా. ఆ సినిమాని తెలుగులో ‘లవర్స్‌ డే’  పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి అల్లు అర్జున్ అతిథిగా వ‌స్తున్నాడు.

 

``బ‌న్నీతో క‌ల‌సి న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. అయితే నా సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి ఆయ‌న రావ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న రాకకోసం మా టీమ్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది'' అని చెప్పుకొచ్చింది ప్రియ‌.  ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాలో బ‌న్నీ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. బ‌హుశా ఆ అవ‌కాశం ఈసారి ప్రియాకే ద‌క్కుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS